Indalwai | విద్యుదాఘాతంతో యువకుడికి గాయాలు

Indalwai | విద్యుదాఘాతంతో యువకుడికి గాయాలు
Indalwai | విద్యుదాఘాతంతో యువకుడికి గాయాలు

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | విద్యుదాఘాతంతో ఓ యువకుడు గాయాలపాలైన ఘటన ఇందల్వాయి మండలంలోని దేవితండాలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవితండా(devi thanda)కు చెందిన కల్యాణ్‌ అనే యువకుడు గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్‌ సమస్య తలెత్తడంతో సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు. అయితే విద్యుత్​ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లకుండానే కల్యాణ్​కు ఎల్సీ ఇచ్చారు.

ఈ క్రమంలో విద్యుత్‌ స్తంభం(current pole) ఎక్కిన కల్యాణ్‌కు కరెంట్‌ షాక్‌ కొట్టడంతో కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గత ఆదివారం జరుగగా విద్యుత్‌ అధికారులు గోప్యంగా ఉంచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, తమను ఆదుకోవాలని బాధితుడి కుటుంబీకులు కోరుతున్నారు. అయితే ఒక ఎల్సీకి బదులుగా మరో ఎల్సీ ఇవ్వడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  shock | విద్యుత్ షాక్​తో కూలీ మృతి