యువకుడి సూసైడ్ కలకలం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని న్యాల్కల్ రోడ్డులో నివాసం రాథోడ్ రమేష్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. నిజాంసాగర్ మండలానికి చెందిన రాథోడ్ రమేష్ రోటరీనగర్ కి చెందిన భార్గవి పదేళ్ళ కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల వీరి మధ్య గొడవ జరుగగా.. భార్గవి కుటుంబీకులు మందాలించారని, ఈ కారణంగానే తన సోదరుడు సూసైడ్ చేసుకున్నట్లు మృతుని అన్న రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్ తెలిపారు.