అక్షరటుడే, వెబ్‌డెస్క్: RTC bus : ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం సృష్టించాడు. తాగి బస్సు ఎక్కడమే కాకుండా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించాడు. వారితో గొడవకు దిగాడు. దీనికితోడు అమ్మాయిలని కూడా చూడకుండా దాడికి దిగి, తన్నటం మొదలుపెట్టాడు. చివరికి యువతులు దేహశుద్ధి చేయడంతో నోరు మూసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
సిద్దిపేట డిపో ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు యువతులపై అసభ్యంగా ప్రవర్తించాడు. వేములవాడ(Vemulawada) నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల(Sircilla) కలెక్టరేట్(Collectorate) వద్ద ఆగినప్పుడు మద్యం తాగిన ఓ ప్రయాణికుడు(passenger) అందులో ఎక్కాడు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా వెళ్తున్న సమయంలో, బస్సులోని యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.
ఆ తాగుబోతును అమ్మాయిలు గమనించి ప్రశ్నిస్తే.. వారిపై దాడికి దిగాడు. దీంతో అమ్మాయిలు తాగుబోతుకు బస్సులోనే దేహశుద్ధి చేశారు. తర్వాత అతడిని డ్రైవరు బస్సు నుంచి బలవంతంగా నేరేళ్ళ గ్రామంలో దింపేశాడు. ఈ ఘటనను ఒక ప్రయాణికుడు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ మారింది.
ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం.. drunk man hulchal in RTC pic.twitter.com/nnM9JQZkrb
— Mahadev Narumalla✍ (@Kurmimahadev) April 12, 2025