అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలో అర్ధరాత్రి యువకులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు బీరు బాటిళ్లు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. మంగళవారం రాత్రి నగరంలోని ఆర్యనగర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద గల గణేశ్‌ మండలి యువకులు, మరో మండలి యువకుల మధ్య డీజే విషయంలో మాటామాట పెరిగింది. దీంతో ఇరువర్గాల యువకులు దాడులు చేసుకున్నారు. బీరు బాటిళ్లు, రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ విషయమై ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.