YouTuber ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిన యూట్యూబర్.. ఆ తర్వాత ఘాతుకం

YouTuber ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిన యూట్యూబ్.. ఆ తర్వాత ఘాతుకం
YouTuber ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిన యూట్యూబ్.. ఆ తర్వాత ఘాతుకం

అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: YouTuber | లేడీ యూట్యూబర్‌ Lady YouTuber ప్రియుడితో boyfriend కలిసి భర్తను కిరాతకంగా హతమార్చిన ఘటన హరియాణాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం police report ప్రకారం.. హరియాణాలోని (Haryana) భివానీలో ఉంటున్న యూట్యూబర్‌ రవీనా (YouTuber Raveena), ప్రవీణ్‌ (35)కు 2017లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.

Advertisement

కాగా.. రవీనాకు రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో Instagram ప్రేమ్‌నగర్‌కు చెందిన యూట్యూబర్‌ YouTuber సురేశ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

రవీనా తరచూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో social media పోస్టు చేస్తుండేది. రవీనా, ఆమె ప్రియుడు సురేష్ తో boyfriend Suresh కలిసి సోషల్‌ మీడియోలో వీడియోలు social media videos చేయడం కుటుంబంలో ఎవరికీ నచ్చేదికాదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

భార్య రీల్స్ reels చూసిన భర్త ప్రవీణ్‌ Husband Praveen మద్యానికి బానిపై భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో మార్చి 25న రవీనా ఇంట్లో సురేష్‌ ఉండగా.. వీరిద్దరినీ చూసిన భర్త ప్రవీణ్‌ Husband Praveen ఒళ్లు మండి వారిని నిలదీశాడు. వారి మధ్య గొడవ జరగడంతో.. అదే రోజు రాత్రి రవీనా, సురేష్‌ కలిసి ప్రవీణ్‌ గొంతుకోసి హతమార్చారు.

ఇది కూడా చ‌ద‌వండి :  PM Modi | అభిమానికి బూట్లు తొడిగిన మోదీ

అనంతరం అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో నిందితులిద్దరూ కలిసి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాల్వలో పడేశారు. సీసీటీవీ ఫుటేజీలో రవినా, సురేష్ Raveena and Suresh బైక్ పై ప్రయాణిస్తున్నట్లు, వారి మధ్యలో ప్రవీణ్ మృతదేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. కాగా.. ప్రవీణ్‌ ఎక్కడని పలుమార్లు కుటుంబసభ్యులు family members ప్రశ్నించగా రవీనా పొంతనలేని సమాధానాలు చెప్పసాగింది. దీంతో ప్రవీణ్ కనిపించడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు police ఫిర్యాదు చేశారు.

మూడు రోజుల అనంతరం కాల్వలో ప్రవీణ్ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను CCTV footage పోలీసులు పరిశీలించగా.. భార్య రవీనా వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత రవినాను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా ఆమె నేరం అంగీకరించింది. నిందితురాలిని జైలుకు పంపించారు. పరారీలో ఉన్న ప్రియుడు సురేష్‌ కోసం పోలీసులు police గాలిస్తున్నారు.

Advertisement