అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : అసెంబ్లీకి పోనివాళ్లు ఎవరైనా రాజీనామా చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. జగన్‌ అయినా, వైసీపీ ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే పదవులకు రాజీనామా చేయాలన్నారు. కృష్ణా జిల్లా మచిలిపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల మాట్లాడారు. ఏపీకి బీజేపీ ఇచ్చేది గుండు సున్నా అని, అయినా చందబ్రాబు పొత్తు పెట్టుకోవడం దారుణమన్నారు. బీజేపీకి చంద్రబాబు, జగన్‌ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలోను కులగణన జరగాలన్నారు.