Gudivada Amarnath : కోట‌రీలో ఉన్న వారే కోట‌రి గురించి మాట్లాడితే ఎలా.. విజ‌య‌సాయిరెడ్డిపై అమ‌ర్నాథ్ వ్యాఖ్య‌లు

Gudivada Amarnath : కోట‌రీలో ఉన్న వారే కోట‌రి గురించి మాట్లాడితే ఎలా.. విజ‌య‌సాయిరెడ్డిపై అమ‌ర్నాథ్ వ్యాఖ్య‌లు
Gudivada Amarnath : కోట‌రీలో ఉన్న వారే కోట‌రి గురించి మాట్లాడితే ఎలా.. విజ‌య‌సాయిరెడ్డిపై అమ‌ర్నాథ్ వ్యాఖ్య‌లు
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Gudivada Amarnath : వైసీపీ YCP నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన విజ‌య‌సాయి రెడ్డి జ‌గ‌న్‌తో పాటు ప‌లువురికి ఇన్‌డైరెక్ట్ చుర‌కలు అంటిస్తున్నారు. దీనికి వైసీపీ లీడ‌ర్స్ త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.ఇప్ప‌టికే విజ‌య‌సాయి రెడ్డి Vijayasai Reddyపై కాకాణి విమ‌ర్శ‌లు చేయ‌గా, తాజాగా ఈ లిస్ట్ లోకి విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ Gudivada Amarnath చేరారు. ఆయ‌న విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు వైయస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి Vijayasai Reddy ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఆయ‌న పేర్కొన్నారు. వైయస్ జగన్‌ YS Jagan కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ అమ‌ర్‌నాథ్ అన్నారు.

Gudivada Amarnath : విజ‌య‌సాయి రెడ్డిపై విమ‌ర్శ‌లు..

కోట‌రీ అనేది అన్ని రంగాల్లో, అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో సాధారణంగా కనిపించేదే. టీడీపీ‌లో చంద్ర‌బాబు Chandrababu చుట్టూ కోట‌రీ లేదా? ఆ కోట‌రీల గురించి బ‌య‌ట ఉన్న‌వారెవరైనా మాట్లాడితే బాగుంటుంది. అంతేకానీ కోట‌రీలో ఉండి వ‌చ్చిన వ్య‌క్తులే కోట‌రీ గురించి మాట్లాడ‌టం ఏ మాత్రం స‌బ‌బు కాదు . జగన్ మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంత కంటే గొప్పగా మాట్లాడతారని భావించలేం. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి Vijayasai Reddy విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు కాని ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కొంత తేడా క‌నిపిస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  YS Jagan : అంత దారుణంగా ఓడిపోయినా.. ఇంకా ప‌ద్ధతి మార్చుకోక‌పోతే ఎలా జ‌గ‌న్..!

2024లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యివుంటే పార్టీ నుంచి వెళ్లిపోయేవారా..? ఇదేవిధంగా మాట్లాడేవారా.? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.ఇక ఇదిలా ఉంటే YSRCP వైయ‌స్ఆర్‌సీపీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత 10 నెల‌ల కాలంలో చాలా ప‌రిణామాలు చూసింది. పలువురు పార్టీని వీడి వెళ్లిపోయారు. కొందరు పార్టీ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి Vijayasai Reddy మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ఆయ‌న వ్య‌వ‌సాయం చేయ‌బోవ‌డం లేదు, రాజ‌కీయ‌మే చేస్తార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైపోయింది. ఇక విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌ల‌పై రోజాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా స్పందిస్తార‌ని తెలుస్తుంది.

Advertisement