అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Abhishek Sharma | తొలి మ్యాచ్ గెలిచి ఆ తర్వాత నుండి వరుస పరజాయాలతో consecutive defeats ఇబ్బంది పడ్డ సన్‌రైజర్స్ SRH మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది . సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ Abhishek Sharma విధ్వంసకర శతకంతో చెలరేగడంతో బిగ్ టార్గెట్‌ని కూడా అవలీలగా చేధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ Sunrisers Hyderabad.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీని అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం. సెంచరీ century పూర్తైన తర్వాత జేబులో నుంచి ఓ పేపర్ తీసి.. అందరికి చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. అందులో ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉంది.
Abhishek Sharma | యువీ ప్రశంసలు..
అయితే పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల Punjab Kings fielders తప్పిదాలతో పాటు యశ్ ఠాకూర్ Yash Thakur నోబాల్‌తో no-ball ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ శర్మ Abhishek Sharma.. రెచ్చిపోయి ఆడాడు. ట్రావిస్ హెడ్‌తో Travis Head కలిసి తొలి వికెట్‌కు 171 పరుగులు జోడించిన అభిషేక్.. క్లాసెన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 40 బంతుల్లో సెంచరీ మార్క్ century mark అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తం 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేశాడు.ఆరెంజ్ ఆర్మీ Orange Army తరఫున ఐపీఎల్‌లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు అభిషేక్ శర్మ Ab. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌పై Rajasthan Royals అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ నమోదు చేయగా, ఈ రికార్డ్‌ను అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు.
అభిషేక్ శర్మ సెంచరీ చేసిన తర్వాత ఆయన మెంటర్ యువరాజ్ సింగ్ Yuvraj Singh తన ఎక్స్ లో కామెంట్ చేశాడు. వాహ్.. శర్మజీ కా బేటే.. ఎంతో పరిణితితో ఆడాదు. 98కి సింగిల్, 99 కి సింగిల్. ఇలా మేము చేయలకపోతున్నాం. అద్భుతమైన నాక్, శ్రేయాస్ అయ్యార్ Shreyas Iyer కూడా చాలా అద్భుతంగా ఆడాడు అంటూ యువరాజ్ yuvraj ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు పరాజయాల తర్వాత మరో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ Punjab Kings నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేయగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్సర్లు.. 44 బౌండరీలు నమోదు కావడం విశేషం.