బీఆర్‌ఎస్‌కు బీబీపాటిల్‌ రాజీనామా

0

అక్షరటుడే, బాన్సువాడ: పార్లమెంట్‌ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బీబీపాటిల్‌ రాజీనామా చేశారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ పెద్దలతో భేటీ అయిన కాసేపట్లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీ తరపున జహీరాబాద్ లేదా నాందేడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.