అక్షరటుడే ,ఎల్లారెడ్డి: జహీరాబాద్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీదేనిని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో తాడ్వాయి, రాజంపేట మండలాల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రైతులను రాజుగా మార్చిన ఘనత కేవలం మాజీ సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. వ్యాపారాల కోసం బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.