పదేళ్లలో బీబీ పాటిల్ చేసింది శూన్యం

0

అక్షరటుడే, బాన్సువాడ: జహీరాబాద్ ఎంపీగా పదేళ్లలో బీబీ పాటిల్ చేసింది శూన్యమని నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల కేంద్రంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి బీబీ పాటిల్ అని పేర్కొన్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచినా ఏనాడు కూడా ప్రజల సమస్యలపై పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, గిరిజ షెట్కార్, నాయకులు శ్రీనివాసరావు పాతబాలు, రాజిరెడ్డి, ప్రతాప్ సింగ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.