అక్షరటుడే, వెబ్‌డెస్క్ Zodiac Signs : 2025 మార్చి 29, 30వ తేదీలలో మీన రాశిలోకి ఆరు గ్రహాలు యతి చెందబోతున్నాయి. స్వస్థ గ్రహ కూటమి యోగం వలన కొన్ని రాశుల వారికి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన విధంగా విభిన్నయోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ గ్రహ కూటమి రెండే రోజుల్లో ఉన్నప్పటికీ, ఈ ప్రభావం మాత్రం మే చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. మీన రాశిలోకి శని, శుక్ర, బుధ, చంద్ర, రవి, రాహులు చేరడం వల్ల మీన రాశి వారికి బాగా బలం పెరుగుతుంది. మీన రాశి అనుకూలంగా ఉన్న రాశులన్నీ దీనివల్ల ఉత్తమ ఫలితాలు పొందుతాయి. వృషభం, మిధునం, కర్కాటకం, కన్య, ధనస్సు, మకర రాశిలకు ఈ కూటమి వల్ల అన్ని శుభ ఘనయోగాలు కలగబోతున్నాయి.
Taurus వృషభ రాశి : వృషభ రాశి వారికి కూడా రాశి లాభ స్థానంలో ఆరు గ్రహాలు చేరడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఎన్నో విధాలుగా లాభాలు కలగడమే కాదు, వీరికి ఆర్థికంగానూ బాగుంటుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పనిచేసే ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వృత్తి, వ్యాపారాలలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోయి. ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల కోసం, విదేశాలకు వెళ్లే అవకాశాలుంటాయి.ఇప్పటి వరకు ఉన్న వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
Gemini మిధునం : ఈ రాశి వారికి కూడా 10 వ స్థానంలో ఆరు గ్రహాలు కలిసిపోవడం చేత , ఉద్యోగం చేసే వారికి మీ సమర్థత, ప్రతిభ మరింత గుర్తింపబడుతుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. వ్యాపారాలలోనూ, వృత్తిలోనూ కష్టనష్టాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా ఉన్నత ఉద్యోగాలలోకి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సమాజంలో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. వీరికి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
Cancer కర్కాటక రాశి : ఈ కర్కాటక రాశి వారికి భాగ్య స్థానంలో 6 గ్రహాలు కలవడం చేత అనేక విధాలుగా వీరికి అదృష్టం కలగబోతుంది. అన్నివైపులా నుంచి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు వీరి చేతికి అందుతుంది. విదేశాలకి వెళ్లే వారికి ప్రయాణం అనుకూలంగా మారుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వీరికి అంతా శుభప్రదం. ఎటువంటి కోరికలైనా నెరవేరే సమయం ఇది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.
Virgo కన్యా రాశి : కన్యా రాశి వారికి రాశాధిపతి బుధుడుతో సహారు గ్రహాలు సప్తమ స్థానంలో చేరడం వల్ల, వీరి వైవాహిక జీవితములో ఇప్పటివరకు ఇప్పటివరకు ఉన్న వివాదాలన్ని తొలగిపోతాయి. వీరిరువురి మధ్య సఖ్యత, సానిహిత్యం ఏర్పడుతుంది. వీరు ఎంతో సంపన్నులు అయిన వ్యక్తితో ప్రేమలో పడి వారిని వివాహం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు వ్యాపారాలలోనూ, షేర్లు, స్పెక్యులేషన్ ల మీద గాని, పెట్టుబడులు పెడితే అన్ని లాభాలే చూస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత వివాదాలు, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిని పొందగలరు.
Sagittarius ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి 4వ స్థానంలో 6 గ్రహాలు యతి చెందడం వల్ల ఈ రాశి వారికి సుఖసంతోషాలు కలుగుతాయి. వీరి కుటుంబంలో శుభకార్యాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సొంత ఇంటి గృహ నిర్మాణం, కొత్త వాహనాల కొనుగోలు చేస్తారు. వీరికున్న ఆస్తిపాస్తుల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. పనిచేసే ఉద్యోగాలలోను, వృత్తి వ్యాపారాలలోనూ, సామాజికంగా హోదాలు, స్థాయిలు పెరుగుతాయి. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని శ్రమల వలన వీరికి ఆదాయం వృద్ధి చెందుతుంది. వీరు ఈ సమయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంది.
Capricorn మకర రాశి : ఈ మకర రాశి వారికి 3వ స్థానంలో 6 గ్రహాలు చేరడం వల్ల అనేక విధాలైన పురోగతి ఉంటుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పేర్లు, స్పెక్యులేషన్లు విపరీతంగా పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కూడా వస్తాయి. మీ వృత్తి, వ్యాపారాలలో పోటీ దారులతో మీదే పై చేయి అవుతుంది. సమాజంలో ప్రముఖుడుగా నిలుస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుతాయి.