అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ugadi Rashi Phalalu : శ్రీ కోధి నామ సంవత్సరం శకం ముగిసింది. నేటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కొనసాగనుంది. ఈ కొత్త తెలుగు సంవత్సరాది కొన్ని రాశుల వారికి మంచిని, మరికొందరికి కాస్త అటు ఇటు ఫలితాలను మోసుకొచ్చిందంటున్నారు జ్ఞాన సరస్వతి పంచాంగ కర్త, ఎం ఎ జ్యోతిష్యంలో గోల్డ్ మెడల్ అందుకున్న డా ప్రశాంత్ జోషి సిద్ధాంతి(9848833913). అవేంటో చూద్దామా…

మేష రాశి (ARIES)
ఆదాయం-2 వ్యయం-14 | రాజపూజ్యం-5 అవమానం- 7
గురువు ఉగాది నుంచి మే14 వరకు 2వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో ధర్మకార్యాలు చేసే ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందం కలుగుతుంది. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 12వ స్థానమై అశుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 12వ స్థానమై అశుభుడైనందున ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
కేతువు ఉగాది నుంచి మే18 వరకు 6వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. అన్నివిషయాల్లో విజయం సాధిస్తారు.
గురు, శని, రాహు, కేతువులకు జప, దానములు, సుందరకాండ పారాయణ, రుద్రాభిషేకం, గురు, శని, మంగళ వారాల్లో వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి పూజలు చేయడం మంచిది. అశ్వని వారు వైఢూర్యమును, భరణి వారు వజ్రమును, కృత్తిక వారు కెంపును ధరించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది.

వృషభ రాశి (TAURUS)
ఆదాయం – 11 వ్యయం – 5 | రాజపూజ్యం – 1, అవమానం – 3
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 1వ స్థానమై సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్తపడడం మంచిది. మే 15 తర్వాత వీరికి బాగుంటుంది.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 11వ స్థానమై శుభుడైనందున ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 11వ స్థానమై శుభుడైనందున నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 5వ స్థానమై సాధారణ శుభుడైనందున.. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి రీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు.
మొత్తం మీద పూర్వార్ధం, ఉత్తరార్ధంలలో కొన్ని ఇక్కట్లు తప్పవు. కావున నవగ్రహముల అనుగ్రహం కోసం శ్రీ నృసింహ కవచాన్ని, సుదర్శన శతక పారాయణతో పాటు కృత్తిక వారు కెంపును, రోహిణి వారు ముత్యంను, మృగశిర వారు పగడంను ధరించిన కార్యసిద్ధి కలుగును.

మిథున రాశి (GEMINI)
ఆదాయం – 14 వ్యయం – 2 | రాజపూజ్యం – 4 అవమానం – 3
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 12వ స్థానమై అశుభుడైనందున రుణప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. స్థాన చలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. వీరికి అక్టోబరు నుంచి బాగుంటుంది.
ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 10వ స్థానమై సాధారణ శుభుడైనందున ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 10వ స్థానమై సాధారణ శుభుడైనందున మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 4వ స్థానమై అశుభుడైనందున కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్నికార్యాలు విధిగా వాయిదా వేసుకుంటారు. జాగ్రత్తగా ఉండడం మంచిది.
రాహువులకు వామనావతార స్త్రోత్రంను, వరాహావతార స్త్రోత్రంను ఆదిత్యహృదయ పారాయణ, ఆంజనేయస్వామికి ఆకు పూజలతో పాటు మృగశిర వారు పగడంను, ఆరుద్ర వారు గోమేధికంను, పునర్వసు వారు పుష్యరాగంను ధరించినచో శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాట కరాశి (CANCER)
ఆదాయం – 8 వ్యయం – 2 | రాజపూజ్యం – 7 అవమానం – 3
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 11వ స్థానమై శుభుడైనందున అన్నికార్యాల్లో విజయం సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 9వ స్థానమై అశుభుడైనందున మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 9వ స్థానమై సాధారణ శుభుడైనందున తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 3వ స్థానమై శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
వీటి అనుగ్రహం కోసం దశావతార స్తోత్రంలు, సుదర్శనాష్టకం, ఆదివారం, శనివారం, మంగళవార నియమాలతో పాటు పునర్వసు వారు పుష్యరాగంను, పుష్యం వారు నీలంను, ఆశ్లేష వారు పచ్చను ధరించిన సర్వ శ్రేయోదాయకంగా ఉంటుంది.

సింహ రాశి (LEO)
ఆదాయం -11 వ్యయం – 11 | రాజపూజ్యం – 3 అవమానం – 6
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 8వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించేందుకు రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 8వ స్థానమై అశుభుడైనందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మే 19 7వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 2వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
గురు, శని, కేతువులకు జప, దానాలు ఆపదుద్ధారక స్తోత్రం, కనకధారా స్తోత్రం చేయుట, మఖ వారు వైఢూర్యం, పుబ్బవారు వజ్రంను, ఉత్తర వారు కెంపు ధరించిన కొంత మేలు కలుగును.

కన్యా రాశి (VIGRO)
ఆదాయం – 14 వ్యయం – 2 | రాజపూజ్యం – 6 అవమానం – 6
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 7వ స్థానమై శుభుడైనందున విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 7వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాయింటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 1వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆరోగ్యం గూర్చి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
వీరు పంచాయిధ స్తోత్రం, దశావతార స్తోత్రం, ఆంజనేయ సహస్రనామ స్తోత్రం చేయడం మంచిది. ఉత్తరవారు కెంపును, హస్తవారు ముత్యంను, చిత్తవారు పగడంను ధరించిన శుభఫలితములు పొందుతారు.

తులరాశి (LIBRA)
ఆదాయం – 11 వ్యయం – 5 | రాజపూజ్యం – 2 అవమానం – 2
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 8వ స్థానమై అశుభుడైనందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 6వ స్థానమై శుభుడైనందున బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శత్రు బాధలు దూరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 6వ స్థానమై శుభుడైనందున మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 12వ స్థానమై శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగేందుకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ హృదయం, సూర్య నమస్కారములతో పాటు, చిత్తవారు పగడంను, స్వాతివారు గోమేధికంను, విశాఖ వారు పుష్యరాగంను ధరించిన మేలు కలుగుతుంది.

వృశ్చికరాశి (scorpio)
ఆదాయం – 2 వ్యయం – 14 | రాజపూజ్యం – 5 అవమానం – 2
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 7వ స్థానమై శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 5వ స్థానమై అశుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
రాహువు ఉగాది నుండి మే 18 వరకు 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పిల్లలవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
ఈ రాశివారు నవగ్రహ మఖం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా, శని, మంగళ, గురువార నియమంలతో పాటు విశాఖవారు పుష్యరాగంను, అనూరాధ వారు నీలమణిని, జ్యేష్ఠ వారు పచ్చను ధరించిన శుభఫలితాలు పొందుతారు.

ధనుస్సు(Sagittarius)
ఆదాయం – 5 వ్యయం – 5 | రాజపూజ్యం – 1 అవమానం – 5
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 6వ స్థానమై సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహిండం మంచిది. రహస్య శత్రు బాధలుండే అవకాశం వుంది.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 4వ స్థానమై అశుభుడైనందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 4వ స్థానమై అశుభుడైనందున చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసికానందం పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేయబడిన కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
ఈ రాశి వారు గురు, శని, రాహు, కేతు వల్ల ఇబ్బందులు కలుగును. కావున సుందరకాండ పారాయణ, ఆదిత్య హృదయ పారాయణ, ముకున్దమాల స్తోత్రంతో పాటు మూలవారు వైఢూర్యంను, పూర్వాషాఢవారు వజ్రంను, ఉత్తరాషాఢవారు కెంపును ధరిస్తే శుభాలు కలుగుతాయి.

మకరం (Capricorn)
ఆదాయం – 8 వ్యయం – 14 | రాజపూజ్యం – 4 అవమానం – 5
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 5వ స్థానమై శుభుడైనందున వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 3వ స్థానమై శుభుడైనందున కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 3వ స్థానమై శుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసం పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తులజోలికి వెళ్లరాదు.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 9వ స్థానమై సాధారణ శుభుడైనందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
ఈ రాశి వారు జపదానములతో పాటు సుదర్శనశతక పారాయణ, శ్రీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటు, ఉత్తరాషాఢ వారు కెంపును, శ్రవణం వారు ముత్యంను, ధనిష్ఠవారు పగడంను ధరించిన అత్యంత శుభ పరిణామాలు కలుగుతాయి.

కుంభం (Aquarius)
ఆదాయం – 8 వ్యయం – 14 | రాజపూజ్యం – 7 అవమానం – 5
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 4వ స్థానమై అశుభుడైనందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పు కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 2వ స్థానమై శుభుడైనందున కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ మేర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 8వ స్థానమై అశుభుడైనందున అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
ఈ రాశి వారు జప, దాన, హోమాదులతో పాటు దశావతార స్తోత్రం, శ్రీ లక్ష్మీనృసింహ స్తోత్రం, శ్రీనారాయణ కవచంతో పాటు ధనిష్ఠవారు పగడంను, శతభిషం వారు గోమేధికంను, పూర్వాభాద్ర వారు పుష్యరాగంను ధరించిన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి(Pisces)
ఆదాయం – 5 వ్యయం – 5 | రాజపూజ్యం – 3 అవమానం – 1
గురువు ఉగాది నుంచి మే 14 వరకు 3వ స్థానమై సాధారణ శుభుడైనందున బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేక పోతారు.
శని ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 1వ స్థానమై అశుభుడైనందున బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహిండం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
రాహువు ఉగాది నుంచి మే 18 వరకు 1వ స్థానమై సాధారణ శుభుడైనందున విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశముంటుంది. అనారోగ్యబాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కేతువు ఉగాది నుంచి మే 18 వరకు 7వ స్థానమై సాధారణ శుభుడైనందున అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకు వేచి చూస్తారు. దైవదర్శనం లభిస్తుంది.
ఈ రాశివారు గ్రహములకు జపదానములతో పాటు నవగ్రహ స్తోత్రం, మన్యుసూక్త పారాయణ, రుద్రాభిషేకం చేయించుటతో పాటు పూర్వాభాద్ర వారు పుష్యరాగంను, ఉత్తరాభాద్రవారు నీలమణిని, రేవతి వారు పచ్చను ధరిస్తే శుభాలు కలుగుతాయి.
