అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : అటవీ అధికారుల జోనల్ స్థాయి క్రీడలు శుక్రవారం నగరంలోని నాగారం రాజారాం స్టేడియంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందన్నారు. ఉద్యోగులు ఆటలు ఆడడంతో ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. క్రీడల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం కూడా పోటీలు కొనసాగనున్నాయి. బాసర సర్కిల్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ శరవనన్, ఆయా జిల్లాల అటవీ అధికారులు నిఖిత, ప్రశాంత్, బాజీరావు పాటిల్, రవి ప్రసాద్, నాగిని భాను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | కిడ్నాప్​ అయిన చిన్నారిని తల్లికి అప్పగించిన పోలీసులు