ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకస్మిక తనిఖీ.

Advertisement

ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో శనివారం పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ కే. ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తనిఖీలో పోస్ట్ ఆఫీస్ డెలివరీ ఫర్ ఫార్మెన్స్ ,నగదు బదిలీ,కొత్త పథకాలు,ఇన్సూరెన్స్ ,పోస్టాఫీసులోని వివిధ పథకాల అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.నూతన ఖాతాల ఓపెనింగ్ లో తెలంగాణ సర్కిల్ ను ప్రథమ స్థానంలో నిలిపిన భీంగల్ మండలంలోని పిప్రి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎస్.కె.అప్సర్ ను శాలువతో సన్మానించి, అభినందించడం జరిగింది.

ఇది కూడా చ‌ద‌వండి :  ABVP Nizamabad | బడ్జెట్లో విద్యారంగానికి నిధులివ్వాలి

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఎన్ .అనిల్ కుమార్ ,ఆర్మూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ అధికారిణి యాపరు సురేఖ,ఆర్మూర్ హెడ్ పోస్ట్ మాస్టర్ కే. అజయ్ కుమార్ ,జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఎస్పీఎం ఆంజనేయులు,ఎం.వోలు దశరథ్ ,చంద్రశేఖర్ బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/watch?v=VcKUcLRjWs8%3Fsi%3Df26hlkVyEiRtP2ms
Advertisement