ఇద్దరు గొలుసు దొంగల అరెస్ట్

0

అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్ లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర గొలుసు చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణాకు చెందిన ఇద్దరు నిందితులు సాహిల్ ఖాన్, మహమ్మద్ హర్షద్ ను అరెస్ట్ చేశారు. బుధవారం నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. జనవరి 4వ తేదీన జాక్రాన్ పల్లి పరిధిలో గొలుసు చోరీ చేసిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారని, నిందితులిద్దరిపైన పలు కేసులు ఉన్నాయని తెలిపారు. వారి నుంచి రెండు తులాల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ కృష్ణ, ఎస్సై తిరుపతి సిబ్బంది ప్రసాద్, రాజేశ్వర్, భూపతి, భూమేశ్, సతీష్, రాము, సర్దార్ బృందాన్ని ఏసిపి అభినందించారు.