కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

అక్షరటుడే, ఆర్మూర్‌: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నపథకాలను అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సూచించారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర సభలో ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలకు మోదీకా గ్యారెంటీ వాహనంతో పాటు ఉద్యోగులు వస్తారని తెలిపారు. కేంద్ర పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, నాయకులు పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్‌ పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Dinesh Kulachari | భూపతి రెడ్డితో చర్చకు సిద్ధం.. దినేష్​ కులాచారి

Advertisement