అక్షరటుడే, వెబ్ డెస్క్: పోలీస్ కస్టడీలో ఉన్న ఓ దొంగ తప్పించుకున్న ఘటన డిచ్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జక్రాంపల్లి సమీపంలోని అర్గుల్ జాతీయ రహదారిపై తాజాగా గొలుసు చోరీ జరిగింది. ఈ ఘటనలో హరియాణకి చెందిన ఓ నిందితుడిని ఐడి పార్టీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సర్కిల్ కార్యాలయం పక్కనే ఉన్న డిచ్పల్లి పీఎస్ కస్టడీలో నిందితుడిని ఉంచారు. అక్కడే దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నిందితుడు బాత్రూంకి వెళ్తానని చెప్పగా స్టేషన్ సిబ్బంది అతన్ని లాకప్ నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది.