అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో గాలిపటం ఇద్దరి ప్రాణాలమీదికి తెచ్చింది. మంగళవారం సాయంత్రం దుబ్బ ప్రాంతంలో ఓ తల్లి కుమారుడు విద్యుత్తు షాక్ బారిన పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గాజుల్ పేటకు చెందిన లక్ష్మి తన కుమారుడు మనోజ్(9)తో కలిసి దుబ్బలోని చెల్లెలు ఇంటికి వెళ్ళింది. అక్కడ కుమారుడు మనోజ్ గాలిపటం ఎగురవేస్తున్న సమయంలో మాంజా విద్యుత్తు వైర్లకు తగిలింది. ఇనుప రాడ్డుతో తీసే క్రమంలో షాక్ తగిలింది. కాపాడబోయిన తల్లి లక్ష్మి సైతం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం బాధితులిద్దరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.