అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఫిన్ టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏంజెల్‌ ట్యాక్స్ రద్దు కూడా ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. శుక్రవారం ముంబయిలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్‌-2024 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. ఫిన్ టెక్ రంగం గత పదేళ్లలో 31 బిలియన్‌ డాలర్లను ఆకర్షించిందని పేర్కొన్నారు. ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.