అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఒకేరోజు నలుగురు కార్పొరేటర్లు ఆ పార్టీని వీడారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమక్షంలో ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన వారిలో బైకాన్ సుదా మధు, ఆకుల హేమలత శ్రీనివాస్, సుంకరి నారాయణ, మల్లేష్ యాదవ్ ఉన్నారు. అయితే గతంలో వీరంతా బీజేపీ నుంచి గెలిచిన వారే కాగా గతంలో బీఆర్ఎస్ లో చేరారు. తాజాగా ఆ పార్టీ అధికారం కోల్పోగా.. అర్బన్ లో బీజేపీ నుంచి ధన్ పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో వారు తిరిగి సొంత గూటికి చేరినట్లు తెలుస్తోంది.