Advertisement
అక్షరటుడే, బోధన్: మైనారిటీ విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరముందని, మహిళలను ఇంటికి పరిమితం చేయవద్దని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం బోధన్‌లో నిర్వహించిన ఆల్‌ఇన్‌వన్ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, మతపరమైన తేడా లేకుండా అందరూ సామాజిక దృక్పథంతో ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఐఎం పట్టణాధ్యక్షుడు ముషీర్‌బాబా, కౌన్సిలర్ శర్కార్ట్, వలీవుద్దీన్ సమీర్ పాల్గన్నారు.
Advertisement