శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి

0

అక్షరటుడే, బాన్సువాడ: మున్సిపాలిటీ పరిధిలోని కొయ్యగుట్ట తండా శివారులో శ్మశానవాటిక భూమి కబ్జాకు గురైందని తండావాసులు గురువారం ఆర్డీవో భుజంగరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వే నంబర్‌ 151లోని 5.15 ఎకరాల స్థలాన్ని 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం శ్మశాన వాటిక కోసం కేటాయించిందన్నారు. కానీ.. కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేశారని వివరించారు. తండాలో 200 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఈ భూమిని శ్మశాన వాటిక కోసం కేటాయించాలని కోరారు.