అక్షరటుడే, బోధన్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జిల్లా పర్యటనకు ముందు పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ రాకను నిరసిస్తూ.. నిజామాబాద్ , బోధన్ లో పోస్టర్లను ఏర్పాటు చేశారు. బోధన్ లో ఈరోజు మధ్యాహ్నం జరిగే బహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇందులో అగ్రనేత రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి, కర్నాటకలో పథకాల అమలులో కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయ్యిందని ఎండగట్టారు.