అక్షరటుడే, వెబ్ డెస్క్: సీఎంవో కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జి.చంద్రశేఖర్ రెడ్డిని తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) తరపున గురువారం కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.