అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పైన పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించింది. జనవరి 4న ఉదయం 11 గంటలకు జరిగే మున్సిపల్ సమావేశానికి కౌన్సిలర్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు 36 మందికి నోటీసులు జారీ చేశారు. అదే రోజున చైర్ పర్సన్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత చైర్ పర్సన్ పండిత్ వినీతపై సొంత పార్టీకి 24 మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా కలెక్టర్ ను కలిశారు. కలెక్టర్ ఆమోదం తెలపడంతో ఆర్మూర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే కౌన్సిలర్స్ గ్రూపులుగా విడిపోయారు. మరోవైపు ఈ అవకాశాన్ని వాడుకొని పదవి దక్కించుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 29, బీజేపీ 5, కాంగ్రెస్, ఎంఐఎంకు ఒక్కొక్కరు చొప్పున కౌన్సిలర్స్ ఉన్నారు.