అక్షరటుడే, నిజామాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 2024 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని బుధవారం ఆవిష్కరించారు.
పాలకవర్గ సభ్యులతో కలిసి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి క్యాలెండర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చంద్ర శేఖర్ రెడ్డి, సాయి కుమార్, శరత్, శాంతిశ్వర్ పటేల్, భూమన్న, లింగయ్య, మోతీలాల్, శంకర్, ఆనంద్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్, నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల డీసీఓ సింహాచలం, బ్యాంకు సీఈఓ నాగభూషణం, డీజీఎంలు, ఏజీఎంలు పాల్గొన్నారు.