అక్షరటుడే, ఇందూరు: బీసీలందరు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో సన్మానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేతలు వీహెచ్, ఆకుల లలిత, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో త్వరలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని జిల్లా నేతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, జాతీయ బీసీ నాయకులు రానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాఘవేందర్, బొబ్బిలి నర్సయ్య, కెంపుల నాగరాజు, రేవంత్, ఎనగందుల మురళి, కరిపె గణేశ్ పాల్గొన్నారు.