అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: రక్తహీనత కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డీఐవో డాక్టర్ అశోక్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బుధవారం వినాయక్ నగర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత గుర్తించిన వారికి మాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్ అరవింద్, డాక్టర్ అజ్మత్, కళాశాల ప్రిన్సిపాల్ రాగలత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.