రూ.24 కోట్ల ధాన్యం పక్కదారి.. నాలుగు రైస్ మిల్లులపై కేసు

0

అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలంలోని నాలుగు రైస్ మిల్లులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణకుమార్ తెలిపారు. గత సీజన్ కు సంబంధించి ఈ మిల్లుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు సమాచారం. పౌర సరఫరాల శాఖ డీఎం జగదీష్ ఫిర్యాదు మేరకు వర్ని పీఎస్ లో నాలుగు మిల్లులపై కేసు నమోదు చేశారు. మొత్తం రూ.24 కోట్ల ధాన్యం అమ్ముకున్నట్లు విచారణలో తేలింది. ఓ మిల్లు యజమాని ఏకంగా రూ.8 కోట్ల ధాన్యాన్ని బయటి వ్యాపారులకు ఆమ్ముకున్నట్లు తెలిసింది. అయితే నాలుగు మిల్లుల పేర్లను తెలిపేందుకు అధికారులు నిరాకరించారు. త్వరలోనే ఈ మిల్లులను సీజ్ చేయనున్నట్లు సమాచారం.