వీడీసీ సభ్యుల అరెస్ట్

0

అక్షరటుడే, నిజామాబాద్: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో పద్మశాలి కులానికి చెందిన కుటుంబాలను బహిష్కరించిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి, అరుణ్, చిన్న గంగారాం, నర్సాగౌడ్, మురళిని గురువారం రిమాండ్ కు తరలించారు. గ్రామానికి చెందిన 40 పద్మశాలి కుటుంబాలను బహిష్కరిస్తూ.. రూ.50 వేలు జరిమానా విధించారు. ఈ ఘటనపై ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఇలాంటి బహిష్కరణలు చట్టరీత్యా నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ జయ్ రాం హెచ్చరించారు.