వీధికుక్క దాడి.. బాలుడి మృతి

0

అక్షరటుడే, నిజామాబాద్: మాక్లూర్‌ మండలం కల్లెడలో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్క దాడిలో అయిదేళ్ల బాలుడు నిషాంష్‌ మృతి చెందాడు. గత నెల 25న బాలుడు తన తాతతో కలిసి పొలానికి వెళ్తుండగా వీధికుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన బాలుడిని నిజామాబాద్‌ లోని ఓ ఆ‌స్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం హైదరాబాద్‌ కు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గతంలో హైదరాబాద్ లో జరిగిన వీధి కుక్కల దాడిలో ఇందల్వాయికి చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. అయినప్పటికీ వీధికుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.