అక్షరటుడే, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అధికారులపై దాడి చేసిన ఘటనలో 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన గ్రామ సభలో అధికారులపై గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. అధికారులను స్థానిక ప్రజలు పరిగెత్తించి మరీ కొట్టారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. భూములు కోల్పోయే రైతులు.. సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో తమ ప్రాంతం కలుషితం అవుతుందని వాపోయారు. న్నారు. ముఖ్యంగా ప్రకృతి, అడవుల్లో జీవించే మాకు.. ఫార్మా సిటీతో చిక్కులు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ దాడిని ఎవరు ముందుండి నడిపించారనే దానిపై ఆరా తీసి 28 మందిని అరెస్టు చేశారు. వారందరినీ పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొడంగల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతర్జాల సదుపాయం నిలిపివేశారు. లగచర్ల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.