అక్షరటుడే, కామారెడ్డి: ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. మంగళవారం ఆమె పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాలక్ష్మి ఉచిత బస్ పథకం రావడం చాలా సంతోషకరమన్నారు. కామారెడ్డి బస్టాండ్ లో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. డిపో మేనేజర్ తో మాట్లాడి కామారెడ్డిలో ఉన్న బస్సులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని తెలుసుకున్నారు. అలాగే కాలేజ్ విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, సలీం, పంపరి శ్రీను, అనూష, ప్రసన్న, సుగుణ పాల్గొన్నారు.