అక్షర టుడే, కామారెడ్డి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా గాంధారి కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు శిక్షణ కేంద్రం పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో చందర్, డాక్టర్ విజయలక్ష్మి, పర్యవేక్షకుడు సంగీత్కుమార్, డీపీఎం రమేష్ తదితరులు ఉన్నారు.