అక్షరటుడే, బోధన్: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన సాలూర మండలం తగ్గెల్లిపల్లిలో జరిగింది. గ్రామ శివారులోని పంట పొలాల్లోకి వచ్చిన జింకను వీధి కుక్కలు వెంబడించి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో జింక మృతి చెందగా అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. గతంలోనూ కుక్కలు వెంబడించిన ఘటనలో జింక రోడ్డు దాటుతూ మృతి చెందింది.