అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం ఆరో రోజు శిక్షణ సప్తాహ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాంట్స్ ఫర్ మదర్ కార్యక్రమంలో భాగంగా పిల్లలు వారి తల్లులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాంచందర్, ఉపాధ్యాయులు వెంకటేశం, రాములు, రాజేందర్, విజయ్ కుమార్, వెంకట్, సంఘమిత్ర, శైలజ, సీఆర్పీలు నర్సింలు శ్రీధర్ కుమార్ పాల్గొన్నారు.