అక్షరటుడే, జుక్కల్: పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు శశికళ(58) పాముకాటుతో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన కథనం ప్రకారం.. శశికళ సోమవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. దీంతో వెంటనే పిట్లం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.