అక్షరటుడే ఆర్మూర్: పట్టణ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జి.వి.నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ, ఇరిగేషన్ భూములకు ఇంటి నంబర్లు ఇచ్చి కోట్లు దోచుకున్నారని, ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అక్రమాలపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎంకు స్వయంగా లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు సుమారు 600 పైచిలుకు అక్రమ ఇంటి నంబర్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్, కౌన్సిలర్ ఆకుల శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పాన్ శ్రీను, పులి యుగంధర్, కలిగోట ప్రశాంత్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.