అక్షరటుడే, బాన్సువాడ: జనగామలో అమృత్ రావు, కవిత న్యాయవాద దంపతులపై దాడిచేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. అకారణంగా దాడి చేసి ఇబ్బందులకు గురిచేసిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మారెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.