అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆర్యనగర్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. నాలుగో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ్‌రెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నారాయణ బంధువులు చనిపోవడంతో గురువారం అంత్యక్రియలకు వెళ్లారు. ఈ సమయంలో దొంగలు ఇంట్లో చొరబడి మూడు తులాల బంగారం అపహరించుకుపోయారు. నారాయణ సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి చోరీ జరిగినట్లు గుర్తించి నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.