అక్షరటుడే, వెబ్ డెస్క్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి హెచ్చరించారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలోని సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల విక్రయ కేంద్రంతో పాటు మహ్మద్ నగర్ మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి అమర్ ప్రసాద్ ఉన్నారు.