అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆదర్శ పాఠశాలల్లో గత పన్నెండేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నామని, ప్రభుత్వం స్పందించి వెంటనే బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. బాన్సువాడ మండలం కొత్తబాది ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. ఈనెల 21న హైదరాబాద్ లో రిలే నిరాహార దీక్ష చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ఫకీరయ్య, కరణ్, నితిన్, లక్ష్మీప్రసన్న, ప్రియదర్శిని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.