అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ఆధ్యాత్మికత చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ ఇందుప్రియ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ రోటరీ క్లబ్‌లో ఓంశాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అమర్‌నాథ్‌ శివలింగ దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్‌ మాట్లాడుతూ.. శ్రావణమాసంలో భక్తులకు అమర్‌నాథ్‌ శివలింగ దర్శనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వరలక్ష్మీ వ్రతం రోజు శివలింగ పూజ ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, వనిత రామ్మోహన్, లతా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్‌ సుధాకర్, అనిల్, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.