అక్షరటుడే, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ బోధన్ పట్టణంతో పాటు ఆర్మూర్, భిక్కనూరు, దోమకొండ మండలాల్లో శనివారం బంద్ పాటించనున్నారు. ఈ మేరకు ఆయా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి విజయవంతం చేయాలని కోరారు.