అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నుంచి ఇన్ ఫ్లో మళ్లీ మొదలైందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలతో ప్రస్తుతం 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు(17.80 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1390.33 అడుగుల(4.17 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.