అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలకు జలాశయంలోకి వరదనీరు వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు(17.80 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1390.80 అడుగుల(4.38 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని చెప్పారు.