అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: టీమిండియా ఇంగ్లండ్‌ టూర్‌ షెడ్యూల్‌ విడుదలైంది. పర్యటనకు సంబంధించిన వివరాలను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. సిరీస్‌ జూన్‌ 20వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు సాగనుంది. మొదటి టెస్ట్‌ హెడ్డింగ్లీలోని లీడ్స్‌ మైదానంలో, రెండో మ్యాచ్‌ బర్మింగ్‌హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది. మూడో టెస్ట్‌ లండన్‌లోని ఐకానిక్‌ లార్డ్స్‌లో, మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో నాలుగు, ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి.