అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాత్రిపూట మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లపై తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య పోలీసులకు ఫోన్‌చేస్తే ఉచితంగా ఇంటి వద్ద దింపుతారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని పేర్కొన్నారు. ‘1091, 7837018555 నంబర్లకు ఫోన్‌ చేస్తే పోలీసులు వచ్చి దింపేస్తారని’ కొందరు సోషల్‌మీడియాలో పుకార్లు సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.