అక్షరటుడే, వెబ్ డెస్క్: బాన్సువాడ, బోధన్ డివిజన్లకు సబ్ కలెక్టర్లుగా 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి కొప్పిశెట్టి, బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతో నియమితులయ్యారు. ప్రస్తుతం బాన్సువాడ, బోధన్ డివిజన్లకు ఆర్డీవోలుగా రమేష్ రాథోడ్, అంబదాస్ రాజేశ్వర్ కొనసాగుతున్నారు. ఐఏఎస్ ల నియామకంతో ఆర్డీవోల బదిలీ అనివార్యం అయ్యింది.